సీఎం జగన్ పై మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రశంసల ఝల్లు కురిపిచారు. మహిళా సాధికారతకు బాటలేసిన అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అంటూ ఆమె కొనియాడారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, రూ.14,205 కోట్ల రుణాన్ని మాఫీ చేయకుండా మహిళలను మోసం చేసాడని విమర్శించారు. సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు పుల్ స్టాప్ పెట్టారని ఆరోపించారు. బాబు హయాంలో A,B గ్రేడ్లుగా ఉన్న సంఘాలను నిర్వీర్యం చేశారని, ఇప్పుడవి C గ్రేడుకు పడిపోయాయని మంత్రి తెలిపారు.