అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి గ్రామంలో ఇంట్లో లేని సమయంలో భారీ చోరీ జరిగింది. హావళిగి గ్రామానికి చెందిన కిరణ్ శెట్టి కుటుంబ సభ్యులతో ఈనెల 10న తిరుపతికి వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే మిద్దె పై నుంచి కిందకు దిగి బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు నగలు, 50 వేల రూపాయలు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న డీయస్పీ నరసింగప్ప, సీఐ శేఖర్ ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.