వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం తథ్యమని టీడీపీ నాయకులు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ గ్రామాల్లో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. అసమర్థ సీఎంగా జగన్రెడ్డి ఘనతకెక్కారని విమర్శించారు. టీడీపీ అధికారం చేపడితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.