లింగ వివక్షకు ప్రతిఒక్కరూ ముగింపు పలకాలని శ్రీకాకుళం జిల్లా డీఆర్‌డీఏ పీడీ విద్యాసార్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్ర సమాఖ్య భవనంలో లింగ వివక్ష, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని చెప్పారు. వారు అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పిల్లలకు తగిన పోషణపై కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. దిశ పోలీసుస్టేషన్ సీఐ లలితకుమారి, ఎస్‌ఐ రాధ, తదితరులు పాల్గొన్నారు.