గ్రామానికి రోడ్డు వేయొద్దన్నారని పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి ఆ ఊరివారు తాళంవేసి, నిరసన తెలిపారు. తాగునీటి బోరు మోటారుకు విద్యుత్ కనెక్షన్ తొలగించారు. నల్లమాడ మండలంలోని కాయలవాండ్ల పల్లిలో నిరసన తెలిపారు. బొగ్గిటివారిపల్లి క్వార్టర్స్ నుంచి కాయలవాండ్లపల్లికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కొన్నిరోజుల క్రితం ముళ్ల కంపలను తొలగించారు. ఇందులో అదే గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు తమ పొలాల మీదుగా రోడ్డు వేయరాదని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు రోడ్డు అవసరంలేనపుడు పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఎందుకంటూ పిల్లలను బయటకు పంపి, తాళాలు వేశారు. తాగునీటి బోరు మోటారుకు విద్యుత్ కనెక్షన్ తొలగించారు. గ్రామానికి 50 ఏళ్లుగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని ఊరిజనం ఆవేదన చెందారు. గతంలో కూడా రెండుమార్లు రోడ్డు మంజూరైతే, అప్పట్లో కొంతమంది రైతులు అడ్డుకోవడంతో నిధులు వెనక్కు వెళ్లాయన్నారు. ప్రస్తుతం బొగిటివారిపల్లి క్వార్టర్స్ నుంచి కాయలవాండ్లపల్లికి రోడ్డు మంజూరైందన్నారు. పనులను రైతులు అడ్డుకున్నారు. దీంతో పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ సురేంద్ర, హెడ్కా నిస్టేబుల్ రమణ కాయలవాండ్లపల్లికి వెళ్లి, గ్రామస్తులతో చర్చించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి తాళం. విద్యుత్ కనెక్షన్ తొలగించడంసరి కాదని సూచించారు. రోడ్డు పనుల సమస్యను తహసీల్దార్లో మాట్లాడి, పరిష్కరిస్తామని చెప్పడంతో గ్రామస్థులు పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి వేసిన తాళాలు తీయించారు.