తమిళనాడు నేలపట్టయ్ కి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న ఉమర్ షరీఫ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ఇంట్లో ఆయుధాలు లభించాయని అధికారులు వెల్లడించారు. తన ఇంటి సమీపంలో సిలంబమ్ కళ నేర్పిస్తున్నాడని తెలిపారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 28న పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa