వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ఇక నుండి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలన్నీ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని డెప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్ తెలిపారు. గురువారం జలుమూరు మండల పరిధిలోని మర్రివలస హెల్త్ వెల్నెస్ సెంటరును సందర్శించి ఎల్సీడీసీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు నెల చివరి నాటికి జిల్లా వ్యాప్తంగా ఎల్సీడీసి సర్వేను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మోహన్, బ్రైట్ ఫ్యూచర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.