పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలోని స్థానిక సంత మైదానంలో ఏ ఐ బి స్కీమ్ ప్రాజెక్ట్ శిలా ఫలకం కు మున్సిపల్ చైర్మన్ బల్లగిరి బాబు శంకుస్థాపనకు ఏర్పాటు పనులను శుక్రవారం పరిశీలన చేశారు. సుమారు 96 కోట్ల వ్యయం తో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేయుటకు ఏర్పాటుకు చేపడుతున్న ప్రాజెక్ట్ యొక్క శిలాఫలకం, స్వతంత్ర సమరయోధులు విగ్రహాలు ఏర్పాటు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి. రాజా గోపాల్ , మున్సిపల్ కౌన్సిలర్ ప్రతినిధి గీతరవి, మున్సిపల్ ఏ యి అవినాష్, సానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.