నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామంలో శుక్రవారం మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం చెందిన బావమరిది బావను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన ఓ టీ దుకాణం వద్ద చేటు చేసుకోవడంతో ఈ సంఘటనను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. మద్యానికి నగదు ఇవ్వలేదన్న కోపంతో అన్నమేడు వెంకటేశ్వర్లును తన బావమరిది కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్యకు గురైన వెంకటేశ్వర్లును పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని మృతుడి శరీరంపై ఉన్న కత్తి పోట్లు ను పట్టణ సిఐ ప్రభాకర్ రావు పరిశీలించారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలుపై విచారణ చేపట్టారు.