దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారుతోంది. అమన్ విహార్ ప్రాంతంలో 55 ఏళ్ల గీత అనే మహిళను ముగ్గురు దుండగులు గురువారం రాత్రి కాల్చి చంపారు. ఓ వ్యక్తి ఇంటి ముందు నిలబడి ఉండగా, మరో వ్యక్తి రోడ్డుపై కాపలా ఉన్నాడు. ఇంటి డోర్ తీసిన మహిళపై గేట్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలి కొడుకు ఓ ముస్లిం యువతిని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడని ఇది ఇష్టంలేని యువతి బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారని బంధువులు ఆరోపించారు.