ప్రొద్దుటూరు: బి. సి. భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాన్వాయ్ బయలుదేరారు. మైదుకూరు రోడ్డులోని అన్వర్ థియేటర్ వద్ద గల వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మరియు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కడప నగరంలోని పాత రిమ్స్ లో బీసీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాన్వాయ్ దాదాపు 100 వాహనాల లో 500 మంది తో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, ఐదవ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, 22వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, 19 వ వార్డు కౌన్సిలర్ మునీర్, ఎమ్మెల్సీ సోదరుడు ఆర్. ప్రసాద్, దుగ్గిరెడ్డి రఘునాథ రెడ్డి, బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, సి. కృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసులు, భారీ సంఖ్యలో బి. సి. నాయకులు, అభిమానులు, కార్యకర్తలు బయలుదేరారు.