మలేసియాలో మృత్యువు విలయ తాండవం చేసింది. ఓ వ్యవసాయ క్షేత్ర పర్యాటక శిబిరంపై కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందగా, మరో 15 మంది ఆచూకీ కానరాలేదు. వీరు మట్టిశిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపుర్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని బతాంగ్ కాలిలో శుక్రవారం వేకువజామున ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రమాద సమయంలో 90 మందికి పైగా పర్యాటకులు అక్కడ గుడారాలు వేసుకొని నిద్రిస్తున్నారు. వీరంతా నిద్రలో ఉండగానే 30 మీటర్ల ఎత్తు నుంచి భారీ శబ్దంతో కొండచరియలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.