ప్రసిద్ధ శ్రీనగర్ జామియా మసీదు నిర్వాహకులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మసీదులో ఫోటోగ్రఫీతో పాటు స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడంపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంజుమన్ ఆక్వాఫ్ సెంట్రల్ జామియా మసీదు పేరుతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఫోటోలు, వీడియో పరికరాలను మసీదులోకి అనుమతించమని.. గేట్ వద్దే ఆపేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మసీదు ఆవరణలోకి తినుబండారాలను కూడా తీసుకెళ్లడాన్ని నిషేధించింది. వెంటనే ఈ సూచనలను భద్రతా సిబ్బంది అమలు చేయాలని మసీదు నిర్వాహకులు సూచించారు.