కేంద్ర ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ కి సంబంధించి పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్ (బీహెచ్) సిరీస్ నెంబర్లను పొందొచ్చని కేంద్రం తెలిపింది. బీహెచ్ సిరీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకూ కొత్త వాహనాలు మాత్రమే బీహెచ్ సిరీస్ తీసుకోవడానికి వీలుండగా తాజా నిర్ణయంతో అవసరమైన పన్ను చెల్లింపులు చేసి సాధారణ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాహనాలు సైతం బీహెచ్ సిరీస్ కు మారే అవకాశం కలగనుంది. కాగా, గతేడాది సెప్టెంబర్ లో ‘భారత్ సిరీస్’ను కేంద్రం అమల్లోకి తెచ్చింది.