ఉక్రెయిన్ పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. శుక్రవారం 70కి పైగా మిస్సైల్స్ ను ఉక్రెయిన్ భూభాగాలపై ప్రయోగించింది. యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి రష్యా ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్ అంధకారంలో చిక్కుకుంది. ఓ అపార్ట్ మెంట్ పై క్షిపణి పడడంతో ముగ్గురు, ఖేర్సన్ లో మరొకరు మరణించారని అధికారులు తెలిపారు. అలాగే కీవ్, ఖేర్సన్, ఖార్కివ్ లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని వెల్లడించారు.