ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియల కోసం సిద్ధం అవుతుండగా తిరిగి బతికిన విచిత్ర ఘటన తమిళనాడులో జరిగింది. పుదుకోట జిల్లా ఆలంపట్టి మురండాంపట్టి గ్రామంలో 60 ఏళ్ల రైతు షణ్ముగం.. అనారోగ్యంతో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత అతను మృతి చెందాడని మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. మృతదేహాన్ని ఇంటి బయట తిన్నెపై కూర్చోబెట్టి ఆచారం ప్రకారం షణ్ముగం కొడుకు చివరిసారిగా నోట్లో పాలు పోశాడు. అనంతరం ఒక్కసారిగా షణ్ముగం దగ్గుతూ కళ్లు తెరిచాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు.