ప్రతి రోజూ గుడ్డు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ సీబీఐ నివేదిక ప్రకారం గుడ్డులోని ప్రొటీన్ పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. అయితే గుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి హానికరమనే అపోహ కొందరిలో ఉంది. గుడ్డులోని పచ్చసొన, లోపలి తెల్లటి భాగం రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎయిమ్స్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. పచ్చసొనలో ఏ, ఈ, కే విటమిన్లు, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.