ఏపీ హైకోర్టులో ఉద్యోగ భర్తీకి పరీక్ష తేదీని హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. 241 ఉద్యోగాల భర్తీకి జనవరి 20వ తేదీన కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 14 నుండి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, ఓవర్సీస్, అసిస్టెంట్ ఓవర్సీస్, టైపిస్ట్, కాపీయిస్ట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.