అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా మరో ఉపగ్రహాన్ని శుక్రవారం నింగిలోకి పంపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాసముద్రాలు, నదులు, సరస్సులను మ్యాప్ చేసే సామర్థ్యం ఈ ఉపగ్రహాన్ని కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహానికి ‘సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ (స్వాట్)' అని పేరు పెట్టారు. దీన్ని ఫ్రాన్స్‌తో కలిసి నాసా అభివృద్ధి చేసింది. ఇది భూమిపై 90% ప్రాంతంలోని లక్షలాది చెరువులు, సరస్సులపై సర్వే చేస్తుంది. దీనివల్ల నీటి గమనం గురించి శాస్త్రవేత్తలు ముందే ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది. దీంతో ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాలను సకాలంలో అప్రమత్తం చేయవచ్చు.