రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహదారుడు అలెగ్జాండర్ డుగిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చిన ఆయన ప్రస్తుత యుద్దం ఏక ధృవ ప్రపంచానికి వ్యతిరేకంగా బహుళ ధృవ ప్రపంచానికి దిశగా సాగుతోందని ఆయన తెలిపారు. యుద్ధం తాలూకు ఫలితమేంటన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ "మేం విజయం సాధిస్తే యుద్ధం ఆగిపోతుంది. లేదా ప్రపంచ నాశనంతో ఈ పోరుకు ముగింపు పలికే అవకాశం ఉంది. మేమైనా గెలవాలి.. లేదా ప్రపంచం నాశనం కావాలి" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు పుతిన్ ఆలోచనా ధోరణిని బయటపెడుతోందని భావిస్తున్నారు.