అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5:35 గంటలకు టెక్సాస్ లోని మిడ్ లాండ్ పట్టణంలోని భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మిడ్ లాండ్ కు 22 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని.. భూ అంతర్భాగంలో 9 కి.మీ లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. టెక్సాస్ లో వచ్చిన అతి పెద్ద భూకంపాల్లో ఇది నాలుగోదని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు.