ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని ఎనిమిదో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో పదిమంది మరణించగా అందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మరో 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఏడాదిలోనే ఇది అత్యంత భారీ అగ్నిప్రమాదమని అధికారులు చెబుతున్నారు. 43,000 మంది ప్రజలు నివాసం ఉండే వాల్క్స్-ఎన్-వెలిన్ అనే అత్యంత నిరుపేద ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం వేళ అక్కడి దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఓ తల్లి కిటికీలో నుంచి తన బిడ్డను బయటకు విసిరింది.