పల్నాడు జిల్లా, మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబే అని , జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మాచర్లలో రాళ్లతో, బరిసెలతో, మోటారు బైకులమీద పక్కా పథకం ప్రకారం సామాన్య ప్రజలమీద దాడిచేసింది ఎవరు? నేరుగా మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జే ఈ విధ్వంసంలో సూత్రధారి, పాత్రధారి. ఇది చంద్రబాబుకు తెలిసే జరిగింది. ఎందుకంటే.. ఇటీవలే మాచర్ల సహా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అక్కడివారిని ఎంతగా రెచ్చగొట్టాడో, దాడులు చేయాల్సిందిగా బహిరంగ సభల్లోనే ఎలాంటి సందేశం ఇచ్చాడో అందరికీ తెలుసు. కాబట్టి మాచర్లలో ఇదేం ఖర్మ అంటూ బాబు మనుషులు వస్తుంటే.. స్థానిక ప్రజలు జగనన్న పరిపాలనలో తమకు మేలే జరిగిందని, స్కీంలు- అవినీతిలేకుండా, పక్షపాతం లేకుండా అందాయని చెప్పడంతో తట్టుకోలేని టీడీపీ నాయకులు ఒక పథకం ప్రకారమే మాచర్లలో దాడికి దిగారు అని మండిపడ్డారు.