ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామశేషు మ‌ర‌ణం పై ఆవేదన చెందిన ధ‌ర్మాన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 04:23 PM

శ్రీ‌కాకుళం జిల్లా పరిధిలోని  వైసీపీ నేత,  వైస్ ఎంపీపీ రామశేషు మ‌ర‌ణం అత్యంత బాధాక‌రం అని  మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. రామ‌శేషు స్వ‌గృహంలోనిర్వ‌హించిన సంతాప స‌భ‌లో దివంగ‌త నేతకు పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంపీపీ  రఘురాం ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాను. శ్రీకూర్మం లో ఏ కార్యక్రమం జరిగినా రామశేషు ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగేది. ఈరోజు ఆయన సంతాప సభ నిర్వహించడం బాధాకరం. వివాదాలు లేకుండా ఉండాలి అని, ఎప్పుడు కోరుకుంటాను, నా నియోజకవర్గ పరిధిలో జరిగినందుకు అవమానంగా భావించాను. చంపడంతో సమస్యలు పరిష్కారం కావు. ఆ హత్య చేసిన వ్యక్తి కుటుంబం, హ‌త్య‌ను ప్రోత్స‌హించిన వ్య‌క్తుల స‌మూహం సమాజం నుంచి వెలివేత‌కు గురి అవుతారు. ఇటువంటి హ‌త్యోదంతాలు ప్ర‌జా స్వామ్య దేశాన సంబంధిత వ్య‌వస్థ‌ల మ‌నుగ‌డ‌కు శ్రేయోదాయ‌కం కాదు. రామ శేషు మరణం మాకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com