రైతులు ఆనందంగా ఉంటే ప్రముఖ పత్రిక యజమానికి కడుపుమంట అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. అయన సరికొత్త అవతారం ఎత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రేమను.. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అక్కసును ప్రజలకు ఏవిధంగా తేటతెల్లం చేయాలనే ఆలోచనలో భాగంగా తన పత్రిక ద్వారా రోజుకో వంట వండివారుస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అయన తెగ బాధపడిపోతున్నట్లు కథనం అల్లాడు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నారని..మిల్లర్లు బాగుపడుతున్నారని రాసుకొచ్చారు అని అన్నారు.