చంద్రబాబు నాయుడు కావాలనే మాచర్లలో అరాచకం సృష్టిస్తున్నారని, ప్లాన్ ప్రకారమే వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కర్రలు, బండరాళ్లతో మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి రౌడీముఠా బీభత్సం సృష్టించిందని, టీడీపీ నేతల దాడిలో ముగ్గురు వైయస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారన్నారు. మాచర్లలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడిని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. గొడవకు కారకులైనవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.