మార్గదర్శిలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాలు విసిరారు. దమ్ముంటే మార్గదర్శిలో అవకతవకలు జరగలేదని నిరూపించుకోవాలి అంటూ మంత్రి చాలెంజ్ చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అడ్డగోలు రాతలు రాయడం ఎల్లో మీడియాకు అలవాటైపోయిందన్నారు. నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు వారికీ లేదు. మార్గదర్శిపై రామోజీరావు పిటీషన్ వేయడం హాస్యాస్పదం. మార్గదర్శిలో ఏపీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు చేయొద్దా?. మార్గదర్శిలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా?. దమ్ముంటే మార్గదర్శిలో అవకతవకలు జరగలేదని నిరూపించుకోవాలి’’ అంటూ మంత్రి సవాల్ విసిరారు. దోచుకునేందుకు చంద్రబాబు కంటే రామోజీకి ఎక్కువ ఆత్రంగా ఉంది. మేం రాసిందే రాత అని రామోజీరావు అనుకుంటే అది భ్రమే. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనేదే రామోజీ తాపత్రయం. రామోజీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను అని మంత్రి కాకాణి అన్నారు.