వైఎస్సార్స్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవే ఆఖరు ఎన్నికలని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. మాచర్ల ఘటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై జనం విసిగెత్తిపోయారని.. నిన్నటి మంత్రులు, ఎమ్మెల్యేల భేటీతో సీఎం సౌండ్ తగ్గిందన్నారు. రానున్న ఎన్నికల తర్వాత జగన్రెడ్డి ప్యాలెస్కే పరిమితమవుతారన్నారు. అరాచకం, కిరాతకంతో వైసీపీ ప్రభుత్వం కూడినదని.. పుంగనూరు, మాచర్ల వంటి పలు ఘటనలు అందుకు సాక్ష్యాలని కిమిడి కళావెంకట్రావు అన్నారు.