న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డ్రగ్స్ అమ్మకాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కామత్ హోటల్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్టల్ మేథ్ "ఎం" డ్రగ్స్‌గా పోలీసులు గుర్తించారు. బెంగళూరులో కొనుగోలు చేసి విశాఖలో అమ్ముతుండగా యువకులు పట్టుబడ్డారు. లక్షల్లో విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ కేసుల్లో ఇప్పటి వరకు అధిక స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇదే ప్రథమం. ఇప్పటికే నగరంలో డ్రగ్స్ ముఠాలను జల్లేడు పెట్టే విధంగా సీపీ శ్రీకాంత్ వ్యూహాలు రచ్చించారు. కొత్త సంవత్సరం వేడుకల వేదికగా యువతను టార్గెట్‌గా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు.