విజయనగరం జిల్లా, కొమరాడ,మండలంలో కలెక్టర్ కారును ఓ గిరిజనుడు అడ్డగించాడు. రహదారిపై పడుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం కొమరాడ మండలం బట్టిమొగవలస గిరిజన గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ నిశాంత్‌కుమార్ జిల్లా కేంద్రానికి పయనమయ్యారు. కొంత దూరం వచ్చేసరికి రహదారికి అడ్డంగా తాతబాబు అనే గిరిజనుడు రహదారికి అడ్డంగా పడుకుని కారును అడ్డగించాడు. నయా పంచాయతీలో కొండ శిఖర ప్రాంతాలకు పక్కా రహదారులు నిర్మించాలని, తమ గ్రామాలను కలెక్టర్ సందర్శించాలని డిమాండ్ చేశాడు. ఇంతలో కొమరాడ ఎస్‌ఐ జగదీష్‌నాయుడు హుటాహుటిన గిరిజనుడిని లేపి పక్కకి పంపించారు. ఇప్పటికే నయా గ్రామ పంచాయతీలో రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ తెలిపారు.