స్థలం వివాదంలో రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని బోగినేపల్లికి చెందిన కురుబ నారాయణమ్మపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు, కురుబ నారాయణమ్మకు గ్రామంలో 9.50 సెంట్ల స్థలం ఉంది. దీని వివాదంపై 2020లో జిల్లా సివిల్ కోర్టులో ఇంజెక్షన ఆర్డర్ వచ్చింది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. రాప్తాడు పోలీ్‌సస్టేషనలో పంచాయితీ కూడా చేశారు. వివాదాస్పద స్థలంలో అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఉజ్జినప్ప, అతని కుటుంబ సభ్యులు శుక్రవారం బండలు పాతారు. అడ్డుకున్న నారాయణమ్మపై కర్రలతో దాడిచేశారు. విషయం తెలుసుకున్న టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి పరుశురామ్, నాయకులు గంగులకుంట క్రిష్ణయ్య, మురళి తదితరులు ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి అనుచరులు నారాయణమ్మపై దాడిచేశారని బండి పరుశురామ్ ఆరోపించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులు కురుబ కులస్థులను టార్గెట్ చేసి, దాడులు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణమ్మ స్థలంలో నాటిన బండలను తొలగించాలని అధికారులను కోరారు.