మన్యంలో ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా సీతాలు పండుగ సందడి కనిపిస్తున్నది. ఖరీఫ్ వరి పంట కోతలు పూర్తయి, నూర్పులు జరుగుతుండడంతో గిరిజన రైతులు కుటుంబ సమేతంగా పొలాలకువెళ్లి, ధాన్యం రాశుల వద్ద పూజలు చేస్తున్నారు. కల్లాల్లో ధానాన్ని కుప్పగా పోసి, పూలతో అలకంరించి, అక్కడే కొత్త బియ్యంతో అన్నం వండుకుని తింటారు. వరి నూర్పులు పూర్తయిన తర్వాత సీతాలు పండుగను తప్పకుండా చేయడం గిరిజనుల ఆచారం.