తూర్పు గోదావరి జిల్లా, మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ, ఎంప్లాయి మెంట్ ఎక్సేంజ్, సీడ్ యాప్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఆరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... నిరుద్యోగ యువతకు పరిశ్రమలు, సేవా రంగాల సమన్వయంతో వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. మెగా జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లా నైపుణ్యాభి వృద్ధి సంస్థ అధికారి గంటా సుధాకర్, డీఆర్డీఏ పీడీ బి.శివశంకరప్రసాద్, జిల్లా ఉపాధి కల్పనాధికారిణి వి.వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.