ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువైనాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 18, 2022, 05:56 PM

చంద్రబాబు పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా, తర్లుపాడు, మండలంలోని బుడ్డపల్లెలో ‘ఇదేమి కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ చేస్తున్న అరాచకాలను వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. గత టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాలు ఎంతో అభివృద్థి చెందాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, మాజీ ఎంపీపీ పి.యేసుదాసు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సాదం వీరయ్య, పి.గోపినాథ్‌, మండల యూత్‌ అధ్యక్షులు ఎం.వెంకట్‌, నంబుల లక్ష్మయ్య, నరసింహులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com