కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ లో కీలక సమావేశం జరిగింది. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అంతర్గత, సరిహద్దు భద్రతపై చర్చ సందర్భంగా అమిత్ షా సమక్షంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భద్రతా బలగాలతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి బీఎస్ఎఫ్ సహకరించడం లేదని ఆరోపించారు. బీఎస్ఎఫ్ నిఘా పరిధిని 15 కి.మీ నుంచి 50 కి.మీకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీఎస్ఎఫ్ కు అదనపు అధికారాలు కట్టబెట్టినట్లైందని అన్నారు. అయితే, ఈ అంశంపై చాన్నాళ్లుగా మమత అసహనం వ్యక్తం చేస్తున్నారు.