పాక్ నిర్వహిస్తున్న టీ20 లీగ్ ప్రపంచంలోనే అత్యుత్తమైందని పాక్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ అభిప్రాయపడ్డాడు. "లీగ్ ల ప్రస్తావన వస్తే ఒకప్పుడు అందరూ ఐపీఎల్ గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్ అత్యంత కఠినమైనదిగా నిలిచింది. పాకిస్తాన్ లీగ్ లో ఒక్కసారి ఆడితే ఎవరైనా ఇదే అంటారు. మా లీగ్ లో బెంచ్ పై రిజర్వ్ ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడగలరు. మా దేశంలో లీగ్ విజయవంతం కాదని చాలా మంది అన్నారు కానీ, ఇప్పుడు దీనికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించాయి" అని రిజ్వాన్ అన్నాడు. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎనిమిదో ఎడిషన్ ఫిబ్రవరి 9న ప్రారంభంకానుంది.