ఖతార్ వేదికగా జరగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2022 నేడు ముగియనుంది. నేడు ఫైనల్ పోరులో ఫ్రాన్స్, అర్జెంటీనాలు తలపడనున్నాయి. దీంతో తమ అభిమాన జట్టు గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగాల్ కు చెందిన కాలు దీ అనే మహిళ అర్జెంటీనా గెలవాలంటూ తన టీ దుకాణంలో ఉచితంగా ఛాయ్ అందిస్తోంది. 'అర్జెంటీనా కోసం నేడు ఛాయ్ ఉచితం' అనే బోర్డును ఆమె తన దుకాణం ముందు ఏర్పాటు చేసింది. దీంతో ఓ వ్యక్తి అర్జెంటీనా గెలుపు కోసం ఛాయ్ ఫ్రీ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.