ఉక్రెయిన్‌లో జనావాసాలపై రష్యా వరుస క్షిపణిదాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో నివాస ప్రాంతాలపై రష్యా నిర్వహించిన క్షిపణిదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకటిన్నరేళ్ల పసికూన కూడా ఉన్నట్లు సహాయక బలగాలు గుర్తించాయి. క్రివ్యీ-రీ నగరంలో ఇళ్ల శిథిలాల కింద అత్యవసర బృందాలు గాలిస్తుండగా ఈ మగ శిశువు మృతదేహం లభించింది. 76 క్షిపణుల్ని తమపైకి ప్రయోగిస్తే వాటిలో 16 మాత్రం గగనతల రక్షణ వ్యవస్థల్ని తప్పించుకుని రాగలిగాయని, మిగిలినవాటిని అడ్డుకున్నామని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి.