బీహార్ లోని సరణ్ జిల్లాలో కల్తీం మద్యం తాగి 75 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ డిమాండ్ చేశారు. మద్యం తాగి చనిపోయినవారికి నష్టపరిహారం ఇచ్చేది లేదని సీఎం నితీశ్ కుమార్ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. మద్యం తాగి ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు నష్టపరిహారం ఇస్తామని 2018లో ప్రకటించారని గుర్తుచేశారు. గతేడాది ఖురుర్బనీలో కల్తీమద్యం వల్ల చనిపోయిన వారికీ నష్టపరిహారం ఇచ్చారని, మరి ఇప్పడెందుకు ఇవ్వరని సుశీల్ మోదీ ప్రశ్నించారు.