ఇండియాలోని పలు రాష్ట్రాల్లో టమాట ఫ్లూ వైరస్ విజృంభిస్తుంది. ఈ వైరస్ సోకిన వారికి చేతులు, నోటికి ఎర్రటి పొక్కులు వస్తాయి. జ్వరం కూడా వస్తుంది. ఇది ఎక్కువగా ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు సోకుతోంది. దేశంలో మొదటి టమాట ఫ్లూ కేసు ఈ ఏడాది మే 6న కేరళలో నమోదైంది. దీంతో కేరళ ఆరోగ్య విభాగం అప్రమత్తమై ఇతర రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సెప్టెంబర్ లో అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని రెండు స్కూళ్లలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తమైంది. టమాట ఫ్లూ అనేది ప్రాణాలు తీసేంత భయానక వ్యాధి కానప్పటికీ వేగంగా వ్యాపించగలదు. ఎవరికైనా ఈ వైరస్ లక్షణాలు వస్తే వారిని విడిగా ఉంచాలి. ఎక్కువగా గోరువెచ్చని నీరు, ఇతర ద్రవాలు తాగించాలి. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వాడొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.