అంతర రాష్ట్ర దొంగ రాజునాయక్ (20)ను అరెస్టు చేసి అతని ఆధీనంలో ఉన్న రూ.7.2 లక్షల విలువ కలిగిన 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా, పెద్దమండ్యం ఎస్ఐ వెంకటేష్ వెల్లడించారు. పెద్దమండ్యం మండలం ముసలికుంట గ్రామ పం చాయతీ దామ్ల్లానాయక్ తాండకు చెందిన వెంకట రమణ నాయక్ కొడుకు రాజునాయక్ ను ఆదివారం పెద్దమండ్యం పెట్రోల్ బంక్ సమీపంలో అరెస్టు చేశారన్నారు. గత కొంత కాలంగా కర్ణాటక, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు పెద్దమండ్యం, తురకపల్లి గ్రామాలలో రెండు ద్విచక్ర వాహనాలు చోరీలు చేసినట్లు విచారణలో అంగీకరించిట్లు తెలిపారు. అతనిపై పుంగనూరు, బి.కొత్తకోట పోలీసుస్టేషనలలో చోరీ కేసులు నమోదైనట్లు తేలింది. ఏఎస్ఐ బాలచందర్నాయుడు, హెడ్‌కానిస్టేబుల్ శ్యామ్‌ప్రకాష్, సర్ధార్ హుసేన, పోలీ సులు కిరణ్‌కుమార్, హరిబాబు, రాజేష్, నిజామొద్దీన, సుబ్రమణ్యం పాల్గొన్నారు.