ఆర్టీసీ(పీటీడీ) ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రైవేటీకరణ చర్యలు తక్షణం నిలుపుదల చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 23న నిరసన చేపట్టాలని నిర్ణయించినట్టు ఎ్‌సడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అయ్యప్పరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ముప్పేట సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రెండేళ్లుగా లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ బకాయిలు కూడా ఇవ్వడం లేదన్నారు. మూడు నెలలుగా డ్రైవర్, కండక్టర్లకు ఓవర్‌టైమ్ అలవెన్స్‌లు చెల్లించటం లేదని తెలిపారు.