రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలన చేస్తోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. మాచర్లలో దమనకాండ సృష్టించి వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు జగన్ మోహన్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. ప్రమాదకమైన జగన్ మోహన్ రెడ్డి పాలనను రానున్న రోజుల్లో ప్రజలు కనుమరుగు చేస్తారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభలో చేసిన శపథం నెరవేర్చేలా టీడీపీ కార్యకర్తలు పని చేయాలని కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.