ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై గత ఐదు రోజులుగా వైభవంగా జరిగిన భవానీ దీక్ష విరమణలు ఈరోజు పూర్ణాహుతితో ముగిశాయి. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ... ఈ ఏడాది నాలుగున్నర లక్షల మంది భవాని భక్తులు మాల విరమణకు వచ్చారన్నారు. ఈ ఏడాది దసరాలోనే ఎక్కువ మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. రోజుకి మూడు లక్షల లడ్డూల వరకు విక్రయించినట్లు చెప్పారు. కేశఖండనశాల, స్నానాల గాట్ల వద్ద మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. సుమారు రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు భవాని దీక్ష విరమణలకు ఖర్చు అయి ఉండవచ్చని అన్నారు. భవానీ దీక్షల సందర్భంగా జరిగిన అన్ని కార్యక్రమాలకు సహకరించిన రెవిన్యూ, పొలీసు, మునిసిపల్, ఫైర్, దేవాదాయ శాఖ అధికారులకు ఈవో భ్రమరాంబ ధన్యవాదాలు తెలియజేశారు.