ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కృష్ణ యూనివర్సిటీ, నందిగామలోని ఎమ్మార్ కాలేజీ మధ్య వివాదంతో బీఈడీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణ యూనివర్సిటీకి నందిగామ ఎమ్మార్ కాలేజీ యాజమాన్యం పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు పెద్ద మొత్తంలో ఉండడంతో విద్యార్థులను పరీక్షకు అనుమతించవద్దని కృష్ణ యూనివర్సిటీ అధికారులు మెసేజ్ జారీ చేశారు. ఎమ్మార్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా హాల్ టికెట్లు పొందిన 90 మంది విద్యార్థులు పరీక్ష రాయలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్షలకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బీఈడీ నాలుగో సెమిస్టర్‌లో విద్యార్థులు మొత్తం నాలుగు పరీక్షలు రాయాల్సిన ఉంది. అర్హత లేనప్పుడు తమకు ఎందుకు హాల్ టికెట్లు జారీ చేశారంటూ బీఈడీ విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.