మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి కథలు చెబుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. కోర్టులో దస్త్రాల చోరీపై తానే సీబీఐ విచారణ కోరానని అన్నారు. కోర్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకే సీబీఐ విచారణ నిర్వహిస్తోందన్నారు. మంత్రిగా రైతులకు ఏం చేశారో కాకాణి చెప్పగలరా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. గతంలోనే కాకాణి గోవర్దన్‌పై కల్తీ మద్యం కేసు ఉందన్నారు. నకిలీ పత్రాల కేసులో కాకాణి బెయిల్ తెచ్చుకున్నారన్నారు. గ్రావెల్‌కు కక్కుర్తిపడి పారిశ్రామిక భూములను అక్రమంగా తవ్వేశారన్నారు. నైతిక విలువలుంటే తక్షణమే మంత్రి పదవికి కాకాణి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.