రాష్ట్రంలోని కళాకారులను ప్రోత్సహించేందుకే జగనన్న స్వర్ణోత్సోవ సాంస్కృతిక సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ చెప్పుకొచ్చారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ఇంకా మిగిలే ఉన్నాయని చెప్పారు. సాంస్కృతిక స్వర్ణోత్సవాల పేరిట వాటిని వెలుగులోనికి తెస్తున్న మంత్రి రోజాకు అభినందనలు తెలిపారు. కూచిపూడి నృత్యం కృష్ణా జిల్లాలో పుట్టింది.. ఈ జిల్లాలో పుట్టిన మనమంతా గర్వపడాలన్నారు.