ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, సింగజమే వాంగ్మా భేగపాటి ప్రాంతంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీ పేల్చడంతో ఓ 50 ఏళ్ల మహిళ బుల్లెట్ తగిలి చనిపోయింది. మృతురాలు లైష్రం ఓంగ్బి ఇబెటాంబిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందం విచారణ జరుపుతోంది. మరోవైపు నిందితులను అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని మృతుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa