అజీర్తి ఏర్పడి, పొట్టలో అసౌకర్యం వేధిస్తూ ఉంటే ఈ చిట్కాలు పాటించవచ్చు. ఉదయం అల్పాహారంతో పాటు బెల్లం, నెయ్యి కలిపి తయారుచేసిన మెంతి లడ్డు ఒకటి తినాలి. అలాగే, మధ్నాహ్న భోజనం ముగించిన వెంటనే, ఇంగువ, నల్ల ఉప్పు కలిపిన గ్లాసు మజ్జిగ తాగాలి. రాత్రి నిద్రకు ముందు పాలలో ఒక టీస్పూను చ్యవన్‌ప్రాశ్ కలుపుకుని తాగాలి. ఈ గృహ వైద్యాన్ని పాటిస్తే అజీర్తికి చెక్ పెట్టొచ్చు.