రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం ఢిల్లీలో వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన సుబ్బుస్వామి ఆర్మీలో పని చేసి రిటైర్ కాగా ఆయనకు శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు పెద్దోళ్లతో పరిచయాలున్నాయని.. అవసరమైన వారికి రైల్వే ఉద్యోగాలిప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో సుబ్బుస్వామి ముగ్గురు యువకులను తీసుకు రాగా విషయం తెలిసి మరో 25 మంది వచ్చారు. శివరామన్ వీరి నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేశాడు. వారందరికీ ఐడీ కార్డులిచ్చి ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్ లో రైళ్లను లెక్కించడమే పని అంటూ శిక్షణ ఇచ్చాడు. అనంతరం నియామక పత్రాలివ్వగా వాటితో అధికారుల వద్దకు వెళ్తే అవి ఫోర్జరీవని తేలింది. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.